

అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతులను త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్‌కు చెందిన అంజన (35), తిరువనంతపురంలోని కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూ (40)గా గుర్తించారు. అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న వారి స్నేహితురాలు అనిల ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం శాన్ జోస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. యాన్ మేరీ ఇంటిలోకి చొరబడిన నిందితురాలు ఆమెపై కత్తితో దాడి చేయగా, అంజనను కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉద్యోగ సంబంధిత వివాదమే యాన్ మేరీ హత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు పూర్తి వివరాలు సేకరించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు త్రిస్సూర్ కలెక్టర్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!