

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9కు, సీజన్ 10కు మధ్య ప్రత్యేకమైన కనెక్షన్ చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీజన్ 9 ఫైనల్ వీక్‌లో శ్రీముఖి హౌస్‌లోకి వచ్చిన సమయంలో టాప్ 5 కంటెస్టెంట్లు సీజన్ 10లోకి వచ్చే కంటెస్టెంట్ల కోసం సందేశాలతో లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖలను సీజన్ 10 గ్రాండ్ లాంచ్ సందర్భంగా హోస్ట్ నాగార్జున వేదికపై రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక సీజన్ 10లో కామనర్స్‌గా ఎవరెవరు అడుగుపెట్టనున్నారనే దానిపై కూడా పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఝాన్సీ, రోహిత్, అమాన్ పేర్లు కన్‌ఫర్మ్‌డ్ కంటెస్టెంట్లుగా వినిపిస్తుండగా, సృష్టి, శాలిని, చరణ్ పేర్లకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రాజకుమారి డయానా లేదా అపూర్వలో ఒకరు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ ఉంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని అంచనాలుగానే చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!