
గాసిప్స్

వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఏకే47’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన మ్యూజికల్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో గతంలో మంచి ఆదరణ పొందిన “దండలయ్యా ఉండ్రలయ్యా” పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. కొత్త ట్యూన్, మోడ్రన్ ట్రీట్‌మెంట్‌తో ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వినాయక చవితి పండుగను టార్గెట్ చేస్తూ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రీమిక్స్ పాటకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!