

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును పెంచవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. భారత్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గత వారం చివర్లో ప్రారంభమైన ధరల పతనం ఈ వారం కూడా కొనసాగింది. ఈరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,760, 22 క్యారెట్ల ధర రూ.1,43,690, 18 క్యారెట్ల ధర రూ.1,17,570గా ఉంది. కిలో వెండి ధర రూ.2,59,900గా నమోదైంది.
నిన్న హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,400కు పైగా తగ్గిన విషయం తెలిసిందే. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,56,760, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,690, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,570గా ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,56,760, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,690, 18 క్యారెట్ల బంగారం రూ.1,21,390గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో 24 క్యారెట్ల ధర రూ.1,56,760, 22 క్యారెట్ల ధర రూ.1,43,690, 18 క్యారెట్ల ధర రూ.1,17,570గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,56,910, 22 క్యారెట్ల ధర రూ.1,43,840, 18 క్యారెట్ల ధర రూ.1,17,720గా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!