
జనరల్

ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించాయి. ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గి చమురు ధరలు స్థిరపడుతున్న నేపథ్యంలో ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సర్వీసుల కోతపై పునరాలోచన చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఏటీఎఫ్ ధరలు మరింత తగ్గడం, వివిధ దేశాలు విధించిన గగనతల ఆంక్షలు తొలగితేనే సర్వీసులు పునరుద్ధరించగలమని ఆయన పేర్కొన్నారు. గత నెలలో ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసుల్లో 27 శాతం, దేశీయ సర్వీసుల్లో 22 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకూడదని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కొత్త బీ787-9 విమానంతో పాటు ఎనిమిది నవీకరించిన వైడ్‌బాడీ విమానాలను కూడా సేవల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!