

ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో పేటీఎం షేరు 9.15 శాతం లాభంతో రూ.1,573.50 వద్ద ట్రేడైంది. ఒక్కరోజులోనే షేరు విలువ దాదాపు రూ.131 పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్న సమయంలో పేటీఎం షేరు రాణించడం గమనార్హం.
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ పేటీఎం టార్గెట్ ధరను రూ.1,500 నుంచి రూ.2,200కు పెంచి, ‘ఔట్‌పెర్ఫార్మ్’ రేటింగ్‌ను కొనసాగించింది. శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే షేరు 52 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల ప్రతిపాదన అమల్లోకి వస్తే పేటీఎం నికర పేమెంట్ మార్జిన్లు 3–4 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని బెర్న్‌స్టీన్ పేర్కొంది. దీంతో 2029–30 ఆర్థిక సంవత్సరానికి పేటీఎం ఎర్నింగ్స్ అంచనాలను కూడా పెంచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!