

ఉద్యోగుల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తే వ్యయాలు తగ్గుతాయని భావించిన కంపెనీలు ఇప్పుడు కొత్త వాస్తవాన్ని ఎదుర్కొంటున్నాయి. NVIDIA, Uber వంటి దిగ్గజ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపిన వివరాల ప్రకారం, ఏఐ ఆటోమేషన్‌కు సంబంధించిన కంప్యూట్, టోకెన్ వినియోగ వ్యయాలు ఉద్యోగుల జీతాల కంటే అధికంగా మారుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్ అసిస్టెంట్లు, ఆటోమేషన్ ఏజెంట్ల వినియోగం పెరగడంతో సంస్థలపై భారీ ఆర్థిక భారం పడుతోంది.
అయినా పోటీ ప్రపంచంలో నిలబడటానికి కంపెనీలు ఏఐపై పెట్టుబడులు ఆపడం లేదు. ఉబర్ సీటీఓ ప్రవీణ్ నాగ ప్రకారం, కంపెనీ లైవ్ కోడ్ అప్డేట్లలో 11 శాతం వరకు ఏఐ ఏజెంట్లే రాస్తున్నాయి. మరోవైపు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హ్యుంగ్ ఇంజినీర్లు ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు. అయితే సమర్థత విషయంలో మాత్రం ఏఐపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్ఐటీ నివేదిక ప్రకారం 77 శాతం సందర్భాల్లో మనుషుల పనితీరు ఏఐ కంటే మెరుగ్గా ఉందని తేలింది. దీంతో కంపెనీలు ఏఐ వ్యయాలు తాత్కాలికమా లేక శాశ్వతమా అన్న దానిపై ఆలోచనలో పడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!