

భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అమల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కింద బంగారం దిగుమతులకు సంబంధించిన టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) లైసెన్సుల గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే టీఆర్‌క్యూ లైసెన్సులు పొందిన దిగుమతిదారులందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. గడువు పొడిగింపు కోసం ప్రత్యేక దరఖాస్తు లేదా కాంపోజిషన్ ఫీజు అవసరం లేదని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీఈ) స్పష్టం చేసింది.
ఈ ఒప్పందం ప్రకారం లైసెన్సుదారులు ఏడాదికి గరిష్ఠంగా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కేవలం 1 శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. 2025–26లో యూఏఈ నుంచి భారత్‌కు 15.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కాగా, ఇది 2024–25లో నమోదైన 16.83 బిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 9 శాతం తక్కువగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!