

ఈ రోజుల్లో చాలామంది రాత్రివేళల్లో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే శరీరం, మెదడు కోలుకోవడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. నిద్రలేమి వల్ల అలసట, చిరాకు, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా నిద్ర సరిగా లేకపోతే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరానికి సహజమైన జీవ గడియారం ఉంటుంది. దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. పగలు మెలకువగా, రాత్రి నిద్రపోయేలా ఇది శరీరాన్ని నియంత్రిస్తుంది. రాత్రంతా మేల్కొని ఉండి పగటిపూట నిద్రపోవడం వల్ల ఈ సహజ నిద్ర చక్రం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, తగినంతసేపు నిద్రపోవడం, పడుకునే ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ వినియోగాన్ని తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు. ఆరోగ్య సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!