

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘మిర్జాపూర్ ది మూవీ’ ఈ నెల 4న థియేటర్లలో విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు సహా ఫ్రాంచైజీలోని పలువురు ప్రముఖ నటులు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైంది. సీబీఎఫ్‌సీ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయగా, సినిమా నిడివి సుమారు 3 గంటల 17 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ ప్రారంభమైన నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ఆసక్తి పెరిగింది.
గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పునీత్ కృష్ణ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మాతలుగా వ్యవహరించారు. రసికా దుగ్గల్, శ్వేతా త్రిపాఠి శర్మ, శ్రియా పిల్గావ్కర్, జితేంద్ర కుమార్, రవి కిషన్, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు. ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీలో కొనసాగుతున్న అధికారం కోసం పోరాటం, పాత శత్రుత్వాలు, పరిష్కారం కాని వివాదాలు, కొత్త సవాళ్లు ఈ సినిమాలో మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది.
ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఓటీటీ ప్రీమియర్ తేదీని మేకర్స్ లేదా స్ట్రీమింగ్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా సినిమాలు థియేట్రికల్ విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అదే విధానం కొనసాగితే ‘మిర్జాపూర్ ది మూవీ’ ఈ నెల తర్వాతి కాలంలో లేదా అక్టోబర్ చివర్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!