6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

Writer: Pooja 08:25 AM, 6 సెప్టెంబర్, 2026
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే సుదీర్ఘమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనేది ఉపశీర్షిక. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయం అవుతుండగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మిస్టరీ మ్యూజికల్‌గా రూపొందిన ఈ చిత్రం సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా చూపిస్తుంది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించారు. ప్రతిరోజూ రాత్రి సరిగ్గా 10:30 గంటలకు ఓ రేడియో స్టేషన్‌లో ఒకే పాట ప్రసారం కావడం, నెమలిపాలెం నుంచి పలువురు ఆ పాటను కోరుకోవడం చుట్టూ కథ సాగుతుంది. ఈ కథకు తగ్గట్టుగానే సినిమాకు సుదీర్ఘమైన టైటిల్ పెట్టినట్లు చంద్ర సిద్ధార్థ్ తెలిపారు. తన స్నేహితుడు మదన్‌తో కలిసి రూపొందించాలని భావించిన ఈ కథ, ఆయన మరణానికి ముందు ప్లాన్ చేసిన చివరి ప్రాజెక్టుల్లో ఒకటని చెప్పారు. నాలుగు పాటలు ఉన్న ఈ చిత్రానికి జే రెక్స్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ట్యాగ్లు
చంద్ర సిద్ధార్థ్హర్షమిస్టరీ మ్యూజికల్సైకలాజికల్ థ్రిల్లర్తెలుగు సినిమాజే రెక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

Shiva Nirvana to Direct a Film with Megastar?
గాసిప్స్

Shiva Nirvana to Direct a Film with Megastar?

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు
జనరల్

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం
జనరల్

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా
సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు
జనరల్

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!