
గాసిప్స్

అభి ఫుడ్స్‌కు చెందిన ఎగ్ బ్రాండ్ ‘అభి ఎగ్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో కంపెనీ టర్నోవర్ రూ.47.47 కోట్లుగా నమోదైందని, కార్యకలాపాల విస్తరణతో పాటు కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని అభి ఎగ్స్ సహ వ్యవస్థాపకుడు ఎస్వీవీ దొరా రెడ్డి తెలిపారు.
అంతేకాకుండా పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రావులపాలెం ప్రాంతంలో ఉన్న తమ పౌల్ట్రీ ఫార్ముల్లో ప్రత్యేక పోషక విలువలు కలిగిన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రోజుకు సుమారు 18 నుంచి 20 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని ఆయన వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!