

భారతదేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, రాబోయే మూడేళ్లలో సీఎస్ఆర్ నిధుల పరిమాణం రూ.75 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత రూ.1 లక్ష కోట్ల మార్కును దాటవచ్చని మాజీ ఐఏఎస్ అధికారి డా. భాస్కర్ చటర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన “సీఎస్ఆర్ మీట్స్ ది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్: ముందున్న ప్రయాణం” అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలకు నిధుల సమీకరణలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ (SSE) కీలక వేదికగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ త్వరలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్, ఇతర అంటురాని వ్యాధుల స్క్రీనింగ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రివెంటివ్ ఆంకాలజీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఏఐ ఆధారిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ల ప్రవేశపెట్టడం వంటి లక్ష్యాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!