
సినిమాలు

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయాలంటూ కొంతమంది సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ఈ అంశంపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు బండి సంజయ్ లేఖ రాశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రజాస్వామ్యానికి పునాది అని, నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!