

టీనేజర్లు వాట్సాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంపై తల్లిదండ్రులకు మరింత నియంత్రణ కల్పించేలా కొత్త ఆప్షనల్ పేరెంటల్ కంట్రోల్స్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. టీన్ అకౌంట్లలో ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి, గ్రూపుల్లోకి ఎవరు యాడ్ చేయవచ్చు వంటి ప్రైవసీ సెట్టింగ్స్‌ను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవచ్చు. తమ పిల్లలు ఏదైనా గ్రూపులో చేరినా, బయటకు వచ్చినా, వారు సభ్యులుగా ఉన్న గ్రూపులో కొత్త సభ్యులు చేరినా నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంటుంది. ఛానల్స్, స్టేటస్ అప్‌డేట్లకు సంబంధించిన నియంత్రణలను కూడా తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్త సేఫ్టీ ఫీచర్లు మెటా ఏఐకి కూడా వర్తిస్తాయి. డిఫాల్ట్ 13+ సెట్టింగ్‌తో పాటు మరింత కఠినమైన ‘లిమిటెడ్ కంటెంట్’ ఆప్షన్‌ను తల్లిదండ్రులు ఎంచుకోవచ్చు. ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలంటే పేరెంట్ సెట్ చేసిన పిన్ ద్వారా అనుమతి తీసుకోవాలి. తల్లిదండ్రులు, టీనేజర్ల మధ్య వాట్సాప్ వినియోగంపై చర్చలను ప్రోత్సహించడంతో పాటు ప్రైవసీని కాపాడటమే ఈ ఫీచర్ల ఉద్దేశమని వాట్సాప్ తెలిపింది. వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా, 13 ఏళ్లలోపు పిల్లల కోసం గతంలో పేరెంట్-మేనేజ్డ్ అకౌంట్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!