

వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌కు మరింత మోడ్రన్ లుక్ తీసుకురావడానికి కొత్త డిజైన్ మార్పులను పరీక్షిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం.. ప్రస్తుతం స్క్రీన్ దిగువ భాగంతో కలిసిపోయినట్లుగా కనిపించే బాటమ్ నావిగేషన్ బార్ స్థానంలో ప్రత్యేకంగా కనిపించే ఫ్లోటింగ్ డిజైన్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త బార్‌కు రౌండెడ్ కార్నర్స్ ఉండటంతో యాప్ ఇంటర్‌ఫేస్ మరింత స్టైలిష్‌గా కనిపించే అవకాశం ఉంది.
కొత్త నావిగేషన్ బార్‌ను లైట్, డార్క్ థీమ్‌లలో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లైట్ థీమ్‌లో ఫ్లోటింగ్ ఎఫెక్ట్ మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఐఓఎస్‌లో ఇటీవల తీసుకొచ్చిన ఫ్లోటింగ్ ట్యాబ్ బార్ తరహా డిజైన్‌ను ఆండ్రాయిడ్‌లోనూ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, రెండు ప్లాట్‌ఫామ్‌ల డిజైన్ మార్గదర్శకాలు వేర్వేరు కావడంతో పూర్తి స్థాయిలో ఒకే విధమైన లుక్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.26.38.10 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే అందరు బీటా యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!