
జనరల్

మెటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగం అధిపతి సంతోష్ జనార్దన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన, వచ్చే ఏడాది ప్రారంభంలో తన బాధ్యతల నుంచి తప్పుకుని సంస్థను వీడనున్నారు. 2009 నుంచి ఫేస్‌బుక్ (ప్రస్తుతం మెటా)లో పనిచేస్తున్న ఆయన, సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
మెటా డేటా సెంటర్లు, గ్లోబల్ నెట్‌వర్క్ కార్యకలాపాల నిర్వహణలో సంతోష్ జనార్దన్ విశేష సేవలందించారు. ఆయన స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ బ్రౌన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మెటా భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఈ నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!