

బోట్ మరియు క్వాల్కామ్ కలిసి ప్రీమియం వైర్లెస్ ఆడియో అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. స్నాప్‌డ్రాగన్ S3 Gen 1 ప్లాట్‌ఫారమ్‌తో పనిచేసే బోట్ నిర్వాణ యుటోపియా 2 ప్రో త్వరలో మార్కెట్లోకి రానుంది. సాధారణ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మించి లాస్‌లెస్ బ్లూటూత్ ఆడియో, ఏఐ ఆధారిత అడాప్టివ్ సౌండ్, హెడ్-ట్రాకింగ్ స్పేషియల్ ఆడియో, ఔరాకాస్ట్ బ్రాడ్కాస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఆధునిక హెడ్ఫోన్లు ఇప్పుడు చిన్న కంప్యూటర్ల మాదిరిగా మారుతున్నాయని క్వాల్కామ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన స్నాప్‌డ్రాగన్ ఫర్ ఇండియా కార్యక్రమంలో క్వాల్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డినో బెకిస్, బోట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ శ్యామ్ వేదాంతం మాట్లాడారు. భారతీయ రహదారుల ట్రాఫిక్, గృహ వాతావరణం వంటి వాస్తవ పరిస్థితుల్లో హెడ్ఫోన్ల పనితీరును పరీక్షించి ప్రత్యేకంగా ట్యూన్ చేశామని తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా ANC, మైక్రోఫోన్ నాయిస్ సప్రెషన్, ఆడియో ఫిడెలిటీని మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన ఆడియో అనుభవం కోసం వినియోగదారులు ఇప్పుడు ప్రీమియం హెడ్ఫోన్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!