
క్రీడలు

డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ యూపీఐ ఆటో పేమెంట్లకు ప్రత్యేక లేబుల్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్, చాట్ జీపీటీ వంటి వివిధ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులు ఒకే మర్చంట్ పేరుతో కనిపించడం వల్ల ఏ సేవ కోసం డబ్బు చెల్లించారో గుర్తించడం కష్టంగా మారుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా పేటీఎమ్ కొత్త లేబుల్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌లోని ఆటో పేమెంట్స్ విభాగంలోకి వెళ్లి ప్రతి పునరావృత చెల్లింపుకు వినియోగదారులు తమకు నచ్చిన పేరును లేబుల్‌గా పెట్టుకోవచ్చు. దీంతో ఖర్చులపై స్పష్టత పెరగడమే కాకుండా, సబ్‌స్క్రిప్షన్ల నిర్వహణ సులభమవుతుంది. అవసరమైన సేవలను పొరపాటున రద్దు చేసే ప్రమాదం కూడా తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!