
సినిమాలు

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న ఆషాఢ మాస బోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరిగే బోనాల జాతర, ఫలహారం బండి ఊరేగింపు విశేషాలను ఆయన వివరించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్ జాతరలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, జంగరాజు, శ్రీకాంత్ యాదవ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!