

జలధార–జలహారతి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉండటంతో నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. మొత్తం 82,865 పనులు గుర్తించగా, 79,826 పనులు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. రూ.3,409.35 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్లు తెలిపారు.
చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం వంటి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 563.05 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, గత ఏడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు. తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచాలని, నాగార్జునసాగర్ కాలువల ద్వారా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!