

అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ భారత్‌లోని తన ఇంజినీరింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలు కోల్పోయారు. రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్‌కు ఉద్యోగులను ఆహ్వానించిన సంస్థ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగుల కార్పొరేట్ యాక్సెస్‌ను కూడా నిలిపివేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై మాజీ ఉద్యోగి రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంటర్న్‌గా చేరి రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగిన తాను, ఒక్క సమావేశంతో ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. సంస్థ నుంచి ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఆర్థిక పరిహారం అందలేదని ఆరోపించాడు. ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్‌ఇన్‌లో కేంద్రం మూసివేతను ధ్రువీకరిస్తూ, ప్రభావిత ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే నోటీసు, సెవరెన్స్ అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!