

లైట్నింగ్ నెట్‌వర్క్‌లో LND సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్న నోడ్లపై హ్యాకర్ల దాడి నేపథ్యంలో BTCPay Server కీలక భద్రతా చర్యలు చేపట్టింది. నోడ్లను రిమోట్‌గా యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డాకర్ డిప్లాయ్‌మెంట్లలో BTCPay Server డొమైన్ టోర్ ఆనియన్ యూఆర్‌ఎల్ ద్వారా Zeus వంటి ఎక్స్‌టర్నల్ వాలెట్లు నోడ్‌లను యాక్సెస్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే లైట్నింగ్ చెల్లింపులు కొనసాగవచ్చని, పరిస్థితులు సురక్షితంగా మారిన తర్వాత రిమోట్ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని సంస్థ తెలిపింది. అనధికార లావాదేవీలు, అనూహ్యంగా మూసివేసిన చానళ్లు, గుర్తుతెలియని పీర్లు, బ్యాలెన్స్‌లో తేడాలను పరిశీలించాలని నోడ్ ఆపరేటర్లను సూచించింది.
ఈ భద్రతా లోపం కారణంగా LNDని యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే ‘మకరూన్’ క్రెడెన్షియల్స్ రిమోట్‌గా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు BTCPay వెల్లడించింది. ఇవి దుర్వినియోగమైతే నోడ్‌పై నియంత్రణ సాధించి నిధులను దొంగిలించే ప్రమాదం ఉంటుంది. BTCPay 2.4.2 వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలని సూచించింది. ఇందులో LND 0.21.1 ఉండటంతో సాధారణ BTCPay ఇన్‌స్టాలేషన్లకు కొత్త మకరూన్ క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్‌గా రూపొందుతాయి. అయితే సొంత రివర్స్ ప్రాక్సీ, టోర్ సర్వీస్ లేదా ఫార్వర్డ్ చేసిన పోర్ట్ ద్వారా LNDని యాక్సెస్ చేస్తున్న ఆపరేటర్లు ప్రత్యేకంగా తమ క్రెడెన్షియల్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!