

ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారింది. అయితే సిగ్నల్ లేని ప్రాంతాల్లో నెట్ వినియోగం ఇంకా సవాలుగానే ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా రిలయన్స్ జియో “స్మార్ట్ వాల్” అనే కొత్త సాంకేతికతపై పరిశోధనలు చేస్తోంది. సాధారణ వైఫై బూస్టర్లలా కొత్త సిగ్నల్స్ సృష్టించకుండా, ఇంట్లో ఉన్న సిగ్నల్స్‌ను అద్దం వెలుగును ప్రతిబింబించినట్లుగా బలహీన ప్రాంతాలకు మళ్లించడం ఈ సాంకేతికత ప్రత్యేకత. దీంతో ఇంటి ప్రతి మూలలోనూ సమానంగా నెట్‌వర్క్ లభిస్తుంది.
ఈ స్మార్ట్ వాల్‌లో ప్రత్యేక ప్యానెల్స్ ఉండి గాలిలో తిరిగే రేడియో సిగ్నల్స్‌ను పట్టుకుని అవసరమైన ప్రాంతాలకు పంపిస్తాయి. దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. సిగ్నల్ ఎక్కడ బలహీనంగా ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా మార్గాన్ని మార్చేలా ఏఐ పనిచేస్తుంది. అదనపు పరికరాలు అవసరం లేకుండా తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఈ సాంకేతికత, భవిష్యత్తులో డెడ్ జోన్ల సమస్యను పూర్తిగా తొలగించి ఇంటర్నెట్ వినియోగాన్ని మార్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!