

చాట్‌జీపీటీలో చాట్, వర్క్ మోడ్‌లను ఒకే అనుభవంగా మార్చే కొత్త విధానాన్ని ఓపెన్‌ఏఐ పరీక్షించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన కొంతమంది ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఈ రెండు మోడ్‌లను విలీనం చేయనున్నట్లు ఇమెయిల్ ద్వారా ప్రకటించిన ఓపెన్‌ఏఐ, తాజాగా పరిమిత స్థాయిలో పరీక్షలు చేపట్టింది. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్ థిబాల్ట్ సోషియాక్స్ వెల్లడించారు.
డిసెంబర్ నుంచి చాట్, వర్క్ ఫీచర్లకు ఉమ్మడి వినియోగ పరిమితులను విస్తృతంగా అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న వినియోగ పరిమితులు ఒకే అలవెన్స్‌గా మారితే, అధునాతన రీజనింగ్ మోడళ్లు, కోడెక్స్‌ను తరచుగా ఉపయోగించే సబ్‌స్క్రైబర్లు తమ వినియోగాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సి రావచ్చు. అయితే సాధారణ ఇన్‌స్టంట్ చాట్‌లు ఈ ఉమ్మడి పరిమితి నుంచి మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది. కొత్త విధానంలో వినియోగ పరిమితులు ఎలా లెక్కిస్తారు, ఎంత అలవెన్స్ అందిస్తారు అనే పూర్తి వివరాలను ఓపెన్‌ఏఐ ఇంకా వెల్లడించలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!