
క్రీడలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పేరు మార్పు అంశాన్ని మరోసారి రాజకీయ చర్చలోకి తీసుకొచ్చారు. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ)తో పొత్తు పెట్టుకోవడంపై ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నించారు.
బిహార్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఐదు స్థానాలు గెలుచుకోవడంపై గతంలో ప్రశంసలు కురిపించినంత మాత్రాన ఒవైసీ పట్ల బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని భావించవద్దని యోగి వ్యాఖ్యానించినట్లు సమాచారం. హైదరాబాద్‌ను భాగ్యలక్ష్మీపురంగా పేరు మార్చడమే ఒవైసీకి బీజేపీ ఇచ్చే “బహుమతి” అని ఆయన పేర్కొన్నట్లు కథనం వెల్లడించింది. ఈ వ్యాఖ్యలతో హైదరాబాద్ పేరు మార్పు అంశంపై మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!