

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో విదేశీ మ్యాచ్‌ల్లో బుమ్రా సాధించిన అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 341కి చేరింది. ఈ క్రమంలో 340 వికెట్లతో కెరీర్ ముగించిన భారత మాజీ దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌ను అధిగమించి, అత్యధిక విదేశీ అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 248 మ్యాచ్‌ల్లో 477 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. జహీర్ ఖాన్ 199 మ్యాచ్‌ల్లో 398 వికెట్లతో రెండో స్థానంలో, కపిల్ దేవ్ 206 మ్యాచ్‌ల్లో 368 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బుమ్రా 142 మ్యాచ్‌ల్లో 341 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా, శ్రీనాథ్ 184 మ్యాచ్‌ల్లో 340 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత హర్భజన్ సింగ్ 331, ఇషాంత్ శర్మ 296, మహమ్మద్ షమీ 294, రవిచంద్రన్ అశ్విన్ 290, రవీంద్ర జడేజా 254 వికెట్లతో ఉన్నారు. బుమ్రా 53 టెస్టుల్లో 2.76 ఎకానమీ రేటుతో 239 వికెట్లు సాధించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!