
క్రీడలు

చాట్‌జీపీటీ ద్వారా కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం శుక్రవారం ముసాయిదా పత్రాలు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రైవేట్ పెట్టుబడిదారుల అంచనా ప్రకారం సంస్థ విలువ సుమారు 850 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది సాకారమైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఓపెన్ఏఐ గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీతో కలిసి ఐపీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. సెప్టెంబర్ నాటికి నాస్డాక్లో షేర్లు లిస్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చాట్‌జీపీటీకి వారానికి 90 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉండగా, 5 కోట్లకు పైగా పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కూడా ఐపీఓకు సిద్ధమవడంతో టెక్ ప్రపంచంలో భారీ పోటీ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!