
రాజకీయాలు

చెన్నైలో మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇండియా కూటమి నేతలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తూ ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని నిరసనకారులు ఆరోపించారు. డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్‌కు అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీఎంకే యువజన విభాగం ఈ నిరసన చేపట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!