
జనరల్

భారత్‌లో వాట్సాప్ మొట్టమొదటిసారిగా ‘వాట్సాప్ ప్లస్’ అనే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కోసం నెలకు ₹79 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొదటి నెలను ఉచితంగా ట్రయల్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఈ వాట్సాప్ ప్లస్ పూర్తిగా కస్టమైజేషన్ ప్యాక్ మాత్రమే. మెసేజింగ్, కాలింగ్, స్టేటస్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ప్రధాన ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త ఐకాన్ డిజైన్లు, స్పెషల్ రింగ్‌టోన్స్, స్టిక్కర్ ప్యాక్‌లు, 20 చాట్స్ వరకు పిన్ చేసే అవకాశం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీస్ అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!