
జనరల్

నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న యాక్షన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘దాదా’. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. షూటింగ్ సమయంలో గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
బాలయ్య గాయం కారణంగా షూటింగ్‌లో ఆలస్యం జరిగిందని, దీంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను మేకర్స్ ఖండించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఫస్ట్ సింగిల్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!