

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో నవంబర్ 4న తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులో ఎనిమిది మంది మత్స్యకారుల సంఘం సభ్యులు చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. తొలుత ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఐదుగురిని రక్షించే ప్రయత్నంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతయ్యాయి. ఆ బోట్లలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన సిబ్బంది పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!