
రాజకీయాలు

హార్లీ డేవిడ్సన్ తన కొత్త మోటార్‌సైకిల్ స్ప్రింట్ 440ను EICMA 2026 వేదికగా ఆవిష్కరించింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ బైక్ క్రూయిజర్ తరహా డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఆధునిక ఫీచర్లతో పాటు స్టైలిష్ లుక్‌ను కోరుకునే బైక్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.
స్ప్రింట్ 440లో 440 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 26.7 బీహెచ్పీ గరిష్ఠ పవర్‌తో పాటు 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. భారత మార్కెట్లో దీని ధర దాదాపు రూ.3.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే భారత్‌లో విడుదల తేదీ, తుది ధర, పూర్తి ఫీచర్లపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!