

REDMAGIC తన కొత్త ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ REDMAGIC 12 Proను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 8400mAh భారీ బ్యాటరీని అందించారు. గత మోడల్ REDMAGIC 11 Proలోని 7500mAh బ్యాటరీతో పోలిస్తే ఇది సుమారు 12 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 80W వైర్డ్, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.85 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో పాటు Adreno 850 GPU, Red Core R5 కో-ప్రాసెసర్‌ను అందించారు. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు RGB లైటింగ్‌తో కూడిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 949 డాలర్లు (సుమారు రూ.89,900), 16GB RAM, 512GB వేరియంట్ ధర 1,049 డాలర్లు (సుమారు రూ.99,370), 16GB RAM, 1TB వేరియంట్ ధర 1,199 డాలర్లు (సుమారు రూ.1,13,580). కెమెరాల విషయానికి వస్తే OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 16MP అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Android 17 ఆధారిత REDMAGIC OS 12పై పనిచేసే ఈ ఫోన్‌లో Wi-Fi 7, Bluetooth 6.0, NFC, 5G, స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి IPX8 రేటింగ్ కూడా ఇచ్చారు. నవంబర్ 12, 2026 నుంచి ఎర్లీ బర్డ్ వోచర్ల విక్రయాలు, నవంబర్ 17 నుంచి ఎర్లీ యాక్సెస్ ప్రారంభమవుతాయి. నవంబర్ 18 నుంచి గ్లోబల్ ఓపెన్ సేల్ అందుబాటులోకి రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!