
జనరల్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) GSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
NVS-03 ఉపగ్రహం రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్, పర్యవేక్షణ, అత్యవసర సేవలు వంటి కీలక రంగాల్లో మెరుగైన సేవలు అందించనుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం యావత్ దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయవంతమైన ప్రయోగాలు చేపట్టి దేశ ఖ్యాతిని మరింత పెంచాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!