

అమెరికాకు చెందిన ఏఐ సేవల సంస్థ ఇన్నోడేటా భారత్‌లో పనిచేస్తున్న సుమారు 550 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అక్టోబర్ 26, 2026న ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు బాధిత ఉద్యోగులు వెల్లడించారు. భోజన విరామం తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నించగా, కొందరి ల్యాప్‌టాప్‌లలో లాగిన్ సెషన్లు ముగిసిపోయాయని, ఉద్యోగుల ఐడీలు డీయాక్టివేట్ అయ్యాయని, కంపెనీ అంతర్గత వ్యవస్థలకు యాక్సెస్ నిలిపివేశారని వారు ఆరోపించారు. ముందస్తుగా వ్యక్తిగతంగా హెచ్ఆర్ విభాగం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు.
సిస్టమ్‌లకు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే కొందరికి ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన ఈమెయిల్స్ అందాయని బాధితులు చెబుతున్నారు. వ్యాపార అవసరాలు తగ్గడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుతో ఈ తొలగింపులకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఉద్యోగాల తొలగింపుల విషయంలో సంస్థలు ముందస్తు నోటీసు ఇవ్వాలా? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!