

ప్రీ-డయాబెటిస్ అంటే ఇక మధ్య వయసు లేదా వృద్ధుల్లో మాత్రమే కనిపించే సమస్య కాదని నిపుణులు చెబుతున్నారు. 20, 30 ఏళ్ల వయసులోనే చాలామంది యువత ప్రీ-డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం ఉందని, మారుతున్న జీవనశైలి దీనికి ఒక ముఖ్య కారణంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, డయాబెటిస్‌గా నిర్ధారించే స్థాయికి చేరని దశనే ప్రీ-డయాబెటిస్ అంటారు. ఈ దశలో గుర్తిస్తే ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
రోజూ కూల్‌డ్రింక్స్, స్వీట్స్, బర్గర్లు, పిజ్జాలు వంటి అధిక చక్కెర లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్లు బరువు పెరగడానికి, మెటబాలిక్ ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. రాత్రివేళ ఎక్కువసేపు ఫోన్ చూడటం, తగినంత నిద్ర లేకపోవడం, బ్రేక్‌ఫాస్ట్‌ను తరచూ మానేయడం, అర్ధరాత్రి భారీగా భోజనం చేయడం, చదువు లేదా ఉద్యోగ ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సమతుల్య ఆహారం, తగిన నిద్ర, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, ఒత్తిడి నియంత్రణ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం యువతకు ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!