

మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ వ్యాపారంలో చేపట్టిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్స్‌బాక్స్‌కు చెందిన వివిధ విభాగాల్లో 268 ఉద్యోగాలను తొలగిస్తోంది. హాలో స్టూడియోస్‌తో పాటు ఇతర ఫస్ట్-పార్టీ స్టూడియోలు, ఎక్స్‌బాక్స్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ ఫంక్షన్స్‌లో ఈ కోతలు ఉంటాయని ఎక్స్‌బాక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ మ్యాట్ బూటీ తెలిపారు. జూలై నుంచి అమలైన స్టూడియో మార్పులతో కలిపి, ఇప్పటికే ప్రకటించిన పునర్వ్యవస్థీకరణలో దాదాపు 75 శాతం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 2027 జూలైతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,200 పోస్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రభావం ఎక్స్‌బాక్స్ గేమింగ్ స్టూడియోలపైనా పడుతోంది. డబుల్ ఫైన్, కంపల్షన్ గేమ్స్ ఇప్పటికే స్వతంత్ర సంస్థలుగా మారగా, అండెడ్ ల్యాబ్స్‌ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోంది. నింజా థియరీని విక్రయించేందుకు కుదిరిన రెండు వేర్వేరు ఒప్పందాలు విఫలమైన నేపథ్యంలో ఆ స్టూడియోను మూసివేసే ప్రతిపాదనపై ఉద్యోగులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మరోవైపు ఆర్కేన్, ‘బ్లేడ్’ వంటి ఇతర ప్రాజెక్టులు, స్టూడియోల భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!