

భారీ బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్న కంపెనీల జాబితాలో HONOR మరో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 13,300mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అభివృద్ధి చేసింది. చైనా క్వాలిటీ సర్టిఫికేషన్ సెంటర్ పబ్లిక్ డేటా ప్రకారం, HB6674118ELW-C మోడల్ నంబర్‌తో ఉన్న ఈ బ్యాటరీకి 2026 నవంబర్ 6న 3C సర్టిఫికేషన్ లభించింది. దీని రేటెడ్ కెపాసిటీ 13,300mAh కాగా, ఎనర్జీ 49.48Wh, నామినల్ వోల్టేజ్ 3.72Vగా నమోదయ్యాయి. ఈ బ్యాటరీకి సంబంధించిన వివరాల్లో ATL దరఖాస్తుదారుగా, HONOR తయారీ సంస్థగా పేర్కొన్నారు. టెక్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బ్యాటరీని 7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. HONOR Power3 లేదా X90 Pro Max పేర్లతో ఈ ఫోన్ రావచ్చని లీకులు వినిపిస్తున్నప్పటికీ, కంపెనీ నుంచి అధికారిక ధృవీకరణ లేదు.
గతంలోనూ HONOR భారీ బ్యాటరీలతో పలు ఫోన్లను తీసుకొచ్చింది. HONOR Power2లో 10,080mAh, HONOR WIN RTలో 10,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలను అందించింది. HONOR X80 Pro Maxలో 11,000mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జింగ్ ఉండగా, WIN RT2, WIN Turbo2 మోడళ్లలో 12,070mAh బ్యాటరీని ఉపయోగించినట్లు సమాచారం. మరోవైపు Xiaomi, vivo, iQOO, OPPO వంటి సంస్థలు కూడా అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త ఫోన్‌ను విడుదల చేస్తే మార్కెట్‌లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ధర, విడుదల తేదీ, పూర్తి ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!