

స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం మోటరోలా మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోటరోలా ఎడ్జ్ 70 నియో’ పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికే టీజర్లను విడుదల చేసింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా 50MP సోనీ LYTIA కెమెరాతో పాటు భారీ బ్యాటరీ ఉండనుంది. మల్టీమీడియా వినియోగం, గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 అంగుళాల 1.5K డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేయనున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కానుంది. ఫొటోగ్రఫీ కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించనున్నారు. ఇక 7,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!