17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

Writer: Pooja 12:18 PM, 17 నవంబర్, 2026
ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందిస్తున్నాయి. ఈ సంస్థలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా గణనీయమైన పెట్టుబడులు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, గత రెండేళ్లలో ఎన్విడియాలో ట్రంప్ వాటాల విలువ గణనీయంగా పెరిగింది. 2024 చివరి నాటికి ఆయన వద్ద ఉన్న షేర్ల విలువ 6.15 లక్షల డాలర్ల నుంచి 13 లక్షల డాలర్ల మధ్య ఉండేది. ప్రస్తుతం ఆ వాటాల విలువ 1.3 కోట్ల డాలర్ల నుంచి 6.2 కోట్ల డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే, ట్రంప్ ఇటీవల వెల్లడించిన ఆర్థిక వివరాల్లో చివరి రెండు నెలల లావాదేవీలు లేవు. దీంతో ఆయన వాటాల ప్రస్తుత కచ్చితమైన విలువపై స్పష్టత లేదు.

చైనాకు అధునాతన చిప్‌ల సరఫరా, ట్రంప్ కార్యవర్గంతో ఎన్విడియాకు ఉన్న సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ పెట్టుబడుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, ఎన్విడియాతో పాటు కంప్యూటర్ చిప్‌ల తయారీ, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన మరో రెండు డజన్ల సంస్థలను ‘నేషనల్ ఛాంపియన్స్’గా ప్రకటించేందుకు ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. టెక్నాలజీ రంగంలోని కీలక సంస్థలకు గుర్తింపు కల్పించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్విడియా మంగళవారం తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. దీంతో కంపెనీ పనితీరుపై ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘మోస్ట్‌ వాంటెడ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు అమెరికాలో షాక్‌

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

‘అక్వాన్‌’ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

తీవ్ర తుఫాన్‌గా మారనున్న అక్వాన్..

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్ఎన్విడియా పెట్టుబడులుఎన్విడియా షేర్లుఅమెరికా టెక్నాలజీఏఐ రంగంస్టాక్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆకాశంలో ఒక తార’

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ అధికారుల చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష
జనరల్

కోనసీమ బ్లోఅవుట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!
టెక్నాలజీ

భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీతో HONOR కొత్త ప్రయోగం!

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు
జనరల్

ఎన్విడియాలో ట్రంప్ భారీ పెట్టుబడులు

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ కొనసాగింపు

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్
జనరల్

కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్.. ఘటనపై ఆరా తీసిన పవన్ కల్యాణ్

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ నయవంచనను ప్రజలు గుర్తించారు.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!
బిజినెస్

యుద్ధం నాటి నష్టాలను అధిగమించిన భారత స్టాక్ మార్కెట్లు.. సరికొత్త రికార్డు!

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌ కెరీర్‌లో అతిపెద్ద తప్పిదం.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌
సినిమాలు

ధనుష్‌–అనిరుధ్‌ మధ్య విభేదాల ప్రచారం.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రూమర్స్‌

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!
బిజినెస్

భారత్‌లో ఐబీఎం భారీ పెట్టుబడులు.. క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!