

తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు, మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 23 మెడికల్ షాపుల లైసెన్సులను రద్దు చేయగా, మరో 9 మెడికల్ స్టోర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 28న టీజీ సేఫ్ (TG SAFE) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ ఉల్లంఘనలను గుర్తించారు.
ముఖ్యంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటులో లేకుండానే మెడికల్ షాపులు నిర్వహించడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మందుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!