

ఇంట్లో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రస్తుతం జరుగుతున్న బ్లాక్ ఫ్రైడే సేల్ మీకు మంచి అవకాశం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్‌లలో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు భారీ డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల పై పెద్ద మొత్తంలో తగ్గింపులు అందిస్తున్నారు. ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్ టీవీల పై ఈ సేల్‌లో గణనీయమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ సేల్‌లో 4K టీవీలు నుంచి QLED మోడళ్ల వరకు పలు సిరీస్ లపై ఆఫర్లు ఉన్నాయి. మంచి స్పెసిఫికేషన్లతో కూడిన టీవీని తక్కువ ధరలో పొందాలనుకునేవారికి ఇది మంచి సమయం.
ఈ మోడల్ పై దాదాపు 49 శాతం తగ్గింపు లభిస్తోంది. రూ. 71,990 ధరకు అందుతున్న ఈ టీవీ 4K డిస్ప్లే, బిల్ట్-ఇన్ వాయిస్ అసిస్టెంట్, Samsung Tizen OS వంటి ఫీచర్లతో వస్తుంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, 20W స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. Wi-Fi, HDMI, USB వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
QLED డిస్ప్లేతో వచ్చే ఈ మోడల్ పై 46 శాతం తగ్గింపు ఉంది. ఇప్పుడు ₹ 43,990 కే లభిస్తోంది. Q4 AI ప్రాసెసర్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, 20W ఆడియో, Wi-Fi, AirPlay, మల్టిపుల్ పోర్ట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ మోడల్ పై 35 శాతం తగ్గింపు అమల్లో ఉంది. రూ. 25,490 కే లభిస్తోంది. 4K స్క్రీన్, 20W సౌండ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Wi-Fi, HDMI, USB వంటి ఫీచర్లతో వస్తుంది. తక్కువ ధరలో 4K టీవీ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
ఎంట్రీ లెవల్ బడ్జెట్ సెగ్మెంట్ లో 27 శాతం తగ్గింపుతో ఇప్పుడు రూ. 12,990 కే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. హెచ్డీ డిస్ప్లే, 20W స్పీకర్లు, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, Wi-Fi, HDMI, USB సపోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌టీవీ కొనాలని భావిస్తున్న వారికి బ్లాక్ ఫ్రైడే సేల్ ఒక మంచి అవకాశం అని స్పష్టంగా కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!