
గాసిప్స్

హైదరాబాద్‌కు చెందిన బైక్‌వో గ్రీన్ టెక్ లిమిటెడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన బయో ఎనర్జీ విభాగం రిలయన్స్ బయో ఎనర్జీ నుంచి భారీ ఆర్డర్ లభించింది. రూ.66.46 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌ను బుధవారం బైక్‌వో గ్రీన్ టెక్ వెల్లడించింది. ఈ కాంట్రాక్ట్ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ టెక్నాలజీ కార్యకలాపాలకు కీలకంగా మారనుంది.
ఈ కాంట్రాక్ట్ 2033 జూలై 31 వరకు కొనసాగనుంది. ఒప్పందంలో భాగంగా ప్రత్యేక లోడర్, క్యాచర్, గ్రాబర్ అప్లికేషన్లతో కూడిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను డ్రైవర్లతో సహా హైర్ చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. బయో ఎనర్జీ, పారిశ్రామిక కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రత్యేక పరికరాల వినియోగానికి ఈ ఆర్డర్ ప్రాధాన్యతను సూచిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!