

ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల తారుమారు జరిగాయనే ఆరోపణలు ఇప్పటివి కావు. 1876లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇందుకు ప్రముఖ ఉదాహరణగా నిలిచాయి. రిపబ్లికన్ అభ్యర్థి రూథర్‌ఫర్డ్ బి. హేస్, డెమొక్రటిక్ అభ్యర్థి శామ్యూల్ జె. టిల్డెన్ మధ్య జరిగిన పోటీలో ఇరు పార్టీలూ ఓట్ల మోసం, బ్యాలెట్ బాక్సుల తారుమారు, ఓటర్లను భయపెట్టడం వంటి ఆరోపణలు చేసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో ఫలితాలపై వివాదాలు తలెత్తడంతో దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. చివరకు ప్రత్యేక ఎన్నికల కమిషన్, రాజకీయ రాజీ ద్వారా ఈ వివాదానికి పరిష్కారం లభించింది.
భారత్‌లో 'ఓటు చోరీ' అనే నినాదం 2025 ఆగస్టులో రాజకీయంగా విస్తృత చర్చకు వచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. ఒకే వ్యక్తికి పలుచోట్ల ఓట్లు, చెల్లని చిరునామాలు, అనుమానాస్పద ఓటర్ల నమోదులు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అనంతరం కాంగ్రెస్ ఈ అంశంపై ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండిస్తూ, వాటికి ఆధారాలు సమర్పించాలని కోరింది. దీంతో ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!