

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై రోహిత్ అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా #బిగ్‌బాస్ తెలుగు 10, #జస్టిస్ ఫర్ రోహిత్, #రోహిత్ నాయుడు వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. వచ్చిన వార్తల ప్రకారం, ప్రేక్షకుల ఓటింగ్‌కు బదులుగా హౌస్‌మేట్స్ నిర్ణయం ఆధారంగా రోహిత్‌ను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్‌కు బయట మంచి మద్దతు ఉందని, అతను టైటిల్ రేసులో కొనసాగాల్సిందని అభిమానులు వాదిస్తున్నారు. ప్రేక్షకుల ఓట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా హౌస్‌మేట్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ చేయడంపై నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ఓటింగ్‌కు విలువ లేకపోతే ప్రేక్షకుల నుంచి ఓట్లు ఎందుకు కోరుతున్నారని నిలదీస్తున్నారు.
ఈ వివాదం హోస్ట్ నాగార్జున వరకు చేరింది. వీకెండ్ ఎపిసోడ్లలో ఆయన కంటెస్టెంట్లను ప్రశ్నించే విధానం పక్షపాతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రోహిత్‌ను మొదటి నుంచి టార్గెట్ చేశారని అభిమానులు ఆరోపిస్తుండగా, మరికొందరు మాత్రం హౌస్‌లో జరిగిన పరిణామాల ఆధారంగానే నాగార్జున స్పందిస్తున్నారని సమర్థిస్తున్నారు. మరోవైపు, రోహిత్ ఎలిమినేషన్ తర్వాత సీక్రెట్ రూం ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు వస్తున్న వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అతనికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సీక్రెట్ రూంకు పంపాలని భావించారని కొందరు చెబుతుండగా, రోహిత్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రేక్షకుల ఓటింగ్‌కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? హౌస్‌మేట్స్ నిర్ణయం ఆధారంగా ఎలిమినేషన్ ఎందుకు జరిగింది? సీక్రెట్ రూం విషయంలో అసలు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు బిగ్‌బాస్ నిర్వాహకుల సమాధానం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!