

గూగుల్ తన ప్రతిష్ఠాత్మక ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’లో కీలక విజయాన్ని సాధించింది. అంతరిక్షంలో ఉన్న ప్రోటోటైప్ శాటిలైట్‌పై గెమ్మా 4 (Gemma 4) ఏఐ మోడల్‌ను విజయవంతంగా పనిచేయించింది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్ నుంచి భూమికి తొలి సందేశాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 1న ప్రయోగించిన ప్రోటోటైప్ శాటిలైట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు సమాచారం. అంతరిక్షంలోనే ఏఐ మోడళ్లను పనిచేయించే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ ప్రయోగంలో భాగంగా శాటిలైట్ నుంచి భూమికి అందిన తొలి స్పందన హైకూ (Haiku) కవిత రూపంలో ఉండటం విశేషం. భూమికి దూరంగా ఉన్న అంతరిక్ష వ్యవస్థలో ఏఐ మోడల్‌ను పనిచేయించి, సమాచారాన్ని తిరిగి అందుకోవడం ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి, 2027 నాటికి అంతరిక్షంలో అనుసంధానమైన ఏఐ మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!