

సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ మరియు దర్శకుడు సుందర్ సి దంపతుల పెద్ద కుమార్తె అనంతిక త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ప్రముఖులకు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న ఈ కుటుంబం, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిసి వివాహ ఆహ్వానం అందించింది. అనంతిక, ఆమె కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహ పత్రికను అందజేసి ఆశీస్సులు పొందింది.
ఈ సందర్భంగా ఖుష్బూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. విజయ్ను కలవడం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నారు. తన కుమార్తెలు ఆయనతో గడిపిన క్షణాలను ఎంతో ఆస్వాదించారని, బిజీ షెడ్యూల్లోనూ విజయ్ ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని తెలిపారు. ఆయన అందించిన ప్రేమ, ఆశీస్సులు తమ కుటుంబానికి ఎంతో విలువైనవని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, అనంతిక త్వరలో ఆరంభం చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!