
జనరల్

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కొనసాగుతున్న భారీ వృద్ధి ఆసియా ధనవంతుల జాబితాలో కీలక మార్పులకు దారితీసింది. బైట్‌డ్యాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ సంపద గణనీయంగా పెరగడంతో ఆయన ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మూడో స్థానానికి దిగజారారు.
మరోవైపు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సుమారు 117.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఏఐ, టెక్నాలజీ రంగాల్లో కొనసాగుతున్న పెట్టుబడుల జోరు ప్రపంచ ధనవంతుల జాబితాలో కొత్త మార్పులకు కారణమవుతుండగా, టెక్ రంగానికి చెందిన వ్యాపారవేత్తల సంపద వేగంగా పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!