

రామ్ చరణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెద్ది విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్ది అన్ని ఆటంకాలను దాటి ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చిన్ననాటి రామ్ చరణ్‌ను ఆశీర్వదిస్తున్న పవన్ కళ్యాణ్ ఫొటో ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వీడియోకు స్పందించిన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ప్రేమాభిమానాలు మరియు మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అన్నా కొణిదెల కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్దిలోని ఢిల్లీ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. భావోద్వేగాలు, మాస్ యాక్షన్‌తో నిండిన ఈ భాగాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!